సూపర్ స్టార్ రజనీకాంత్ ఆత్మ కథ రాస్తున్నారా? అంటే అవుననే గతంలో కథనాలొచ్చాయి. కూలీ చిత్రీకరణ సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్వయంగా దీనిపై స్పష్ఠతనిచ్చారు. ఒక బస్ కండక్టర్ గా ప్రారంభమై, అసాధారణమైన స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ జీవితాన్ని పుస్తకంగా తీసుకువస్తున్నారని, సెట్లో రజనీ స్వయంగా కలం పట్టి రాస్తున్నారని, రోజుకు కనీసం రెండు గంటలు పుస్తకం కోసం కేటాయిస్తున్నారని కూడా లోకేష్ హింట్ ఇచ్చారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ స్వయంగా ధృవీకరించారు. తన తండ్రి ఆత్మకథతో రాబోయే పుస్తకం ప్రపంచ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని కూడా సౌందర్య అన్నారు. ఇక ఇదే పుస్తకంలో రజనీ తన 42వ ఏట ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి కూడా రాస్తున్నారు.
రజనీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వెల్లడిస్తారని లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. తదుపరి రజనీకాంత్ నటించిన జైలర్ 2 సమ్మర్ లో విడుదల కానుంది. సిబి చక్రవర్తి దర్శకత్వంలో తలైవా 173 ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.