కల్కి 2898 AD .. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి కల్కి సీక్వెల్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది,.
అయితే ఈ చిత్రం నుంచి కీలక పాత్రధారి దీపికా పదుకొనే ను కల్కి టీమ్ తప్పించింది. కల్కి లో అతి కీలకమైన దీపికా పదుకొనే ను ఆ పాత్ర నుంచి తప్పించడంతో ఇప్పుడు పాత్ర కోసం కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఏ హీరోయిన్ ని తీసుకొస్తారా అనే విషయంలో అందరిలో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది.
ప్రియాంక చోప్రా ఇంకా కొంతమంది పేర్లు వినిపించాయి. తాజాగా దీపికా పదుకొనె స్థానంలోకి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తుంది. సాయి పల్లవి ని కల్కి టీమ్ అప్రోచ్ అయ్యింది అని, ఆమె కూడా ఆ కేరెక్టర్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. చూద్దాం ప్రభాస్ పక్కన సాయి పల్లవి కనిపిస్తుందో లేదంటే మరో హీరోయిన్ వస్తుందో చూద్దాం.