నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం చిత్రానికి అనుకున్న రెస్పాన్స్ రాక ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. బోయపాటి పాన్ ఇండియా పిచ్చి అఖండ 2 పతనానికి కారణమైంది అనే భావన నందమూరి అభిమానుల్లోనే ఉంది. ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో కలిసి NBK111 ప్రాజెక్ట్ పైకి వెళ్ళబోతున్నారు. ముందుగా NBK 111 ప్రాజెక్ట్ పిరియాడికల్ డ్రామాగా ఉండబోతుంది అన్నారు.
ఇపుడు NBK111 ప్రాజెక్ట్ స్టోరీ మారిపోయింది, పక్కా కమర్షియల్ కాన్సెప్ట్ గా ఉండబోతుంది. అదే విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు, అంతేకాదు NBK111 ఎప్పుడు మొదలు కాబోతుందో అనేది ఫుల్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. NBK111 మార్చ్ నుంచి స్టార్ట్ కాబోతుంది అని..
ఈ చిత్రం కమర్షియల్ చిత్రంగా ఉండబోతుంది, బాలయ్య-తన కాంబోలో గతంలో వచ్చిన వీర సింహ రెడ్డి ని మించి NBK111 ఉండబోతుంది అని చెప్పిన గోపీచంద్ ఫ్యూచర్ లో మంచి యాక్షన్ ఫిలిమ్స్, మంచి ఫ్యామిలీ ఫిల్మ్స్, బ్లాక్ బస్టర్ చిత్రాలు చెయ్యబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు.