కింగ్ నాగార్జున రీసెంట్ గానే కింగ్ 100 అంటూ తన 100 వ చిత్రాన్ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న కింగ్ 100 చిత్ర షూటింగ్ విషయాలను నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే ఈచిత్రంలో నాగార్జున తో క్రేజీ మాజీ హీరోయిన్ టబు నటిస్తుంది.. గతంలో నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడ లో నాగార్జున తో కలిసి నటించిన టబు నాగ్ తో కింగ్ 100 చిత్రంలో జోడి కడుతుంది అని చాలామంది క్రేజీగా ఉన్నారు.
ఆ విషయమై నాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టబు నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు, ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తెలుసు నేను నా 100 వ ఫిలిం చేస్తున్నాను అనగానే అందులో టబు కూడా భాగం కావాలని కోరుకుంది అంటూ చెప్పడం చూసి టబు ఖచ్చితంగా నాగార్జున తో కలిసి 100 వ మూవీలో కనిపిస్తుంది అని అక్కినేని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.
ఇక ఈ చిత్రం గురించి నాగ్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల టేస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతుంది, వారి ఆలోచనలకు అనుగుణంగా వారికి ప్రత్యేకమైన సినిమా అందిస్తున్నామని తెలియాలి, వాస్తవికతకు దగ్గరగా ఉండాలని, దానినే ఇష్టపడుతున్నారు. అందుకే ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ లో విఎఫెక్స్ అవి లేకుండా అన్ని ఒరిజినల్ గా ప్లాన్ చేస్తున్నాము, కథకు తగ్గట్టుగా వాస్తవికతకు దగ్గరగా, సహజ సిద్ధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా నాగార్జున పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.