సర్ ప్రైజ్ అనే చెప్పాలి, ప్రభాస్ డెసిషన్స్ చూస్తుంటే నిజంగానే అందరూ షాకవుతున్నారు. రాజసాబ్ రిజల్ట్ వదిలేసిన ప్రభాస్ వెంటనే స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సెట్ లోకి వెళుతున్నారు. అయితే స్పిరిట్ కోసం సగం పూర్తయిన హను రాఘవపూడి ఫౌజీని ప్రభాస్ పక్కనపెట్టారనే న్యూస్ ఉంది.
అదే సమయంలో ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ ల విషయం ఎలా ఉన్నా ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చెయ్యాల్సిన కల్కి సీక్వెల్ కల్కి 2 సెట్ లోకి వెళ్ళబోతున్నారనే వార్త నిజంగా అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఫిబ్రవరి నుంచి ప్రభాస్ కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటారని సోషల్ మీడియాలో టాక్ వినబడుతుంది.
మరి ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ, ఇప్పుడు కల్కి 2 ఈ మూడు చిత్రాలను సెట్ పై ఉంచి ఏ చిత్రం ముందు ఫినిష్ చేస్తారు, ఏ చిత్రాన్ని ముందుగా ప్రేక్షకుల ముందుకు తీకుసుకొస్తారు, ఫౌజీని ఆగష్టు లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మరి ప్రభాస్ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పటినుంచి ఎప్పటికి షిఫ్ట్ అవుతాయో అనే భయం ప్రభాస్ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.