విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మూడోసారి ముచ్చటగా కలిసి నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ-రష్మిక లు ప్రేమలో పడి సీక్రెట్ గా డేటింగ్ చేసుకుంటున్న ఈ జంట వచ్చే నెల అంటే ఫిబ్రవరి 26 న పెళ్ళికి సిద్ధమవుతున్నారనే విషయం సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది.
రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల నడుమ విజయ్-రష్మికల వివాహం జరగబోతుంది, ఇప్పటికే షాపింగ్ గట్రా రెండు కుటుంబాల వారు మొదలు పెట్టేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ విజయ్-రష్మిక మాత్రం గుంభనంగా ఉన్నారు.
మరి రణబాలి లో విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి మరోమారు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయం అఫీషియల్ గా చెప్పారు, ఆ పెళ్లి ముచ్చటేదో కూడా అధికారికంగా ప్రకటిస్తే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. మరి ఇప్పటికైనా రష్మిక-విజయ్ దేవరకొండ లు ఆ గుడ్ న్యూస్ పంచుకుంటే బావుంటుంది.