సంక్రాంతి కి వస్తున్నాం చిత్రం తో గత ఏడాది, అనగనగ ఒకరాజు చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టి సంక్రాంతికి లక్కీ బ్యూటీ అనిపించుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి వృషకర్మ చిత్రంలో నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మీనాక్షి చౌదరి తాజాగా వదిలిన పిక్స్ చూస్తే వావ్ ట్రెడిషనల్ బ్యూటీ అనాల్సిందే.
ఫేస్ లో క్రేజీ ఎక్స్ప్రెషన్ తో మీనాక్షి చౌదరి ఇచ్చిన ఫోజులు చూసి క్యూట్ క్యూట్ గా ఎంత బావుంది అంటున్నారు. లంగా ఓణీ లో మీనాక్షి చౌదరి విలేజ్ గర్ల్ లా బ్యూటిఫుల్ గా కనిపించింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనగనగ ఒక రాజు హిట్ తర్వాత మీనాక్షి చౌదరి పై చాలామంది యంగ్ హీరోల కన్ను పడింది.
ముందుగా ఎవరు మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి, అసలే లక్కీ బ్యూటీ మళ్లీ డేట్స్ మిస్ అయితే అమ్మడు దొరకడం కూడా కష్టం.