సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పలువురు నటీమణులు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఎంతగా దుమారాన్ని రేపాయో అనేది చూస్తూనే ఉన్నాం. సింగర్ చిన్మయి తనని వైరముత్తు హెరాస్ చేసాడు, పడుకుంటేనే అవకాశమిస్తాను అంటూ టార్చర్ పెట్టాడు అంటూ ఎప్పటినుంచో వెలుగెత్తి అరుస్తుంది.
ఇండస్ట్రీలో అవకాశాల కోసం చెప్పింది చెయ్యాల్సిందే, అలా అయితే అవకాశాలు వస్తున్నాయి అంటూ సింగర్ చిన్మయి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సక్సెస్ ఈవెంట్ లో కుమార్తె సుష్మిత నిర్మాతగా మారినట్లుగా చెప్పి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అంటూ చేసిన వ్యాఖ్యలను చిన్మయి విభేదిస్తుంది.
మెగాస్టార్ సినిమాలు చేసే సమయంలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, పరిస్థితులు అనుకూలంగా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు అవకాశం కావాలంటే చెప్పింది చెయ్యాల్సిందే, నన్ను వైరముత్తు ఎంతగా ఇబ్బంది పెట్టాడో అది నాకు తెలుసు, మెగాస్టార్ చిరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ చిన్మయి సోషల్ మీడియా వేదికగా చిరు కు ఎదురెళుతుంది.