ప్రస్తుతం అమెరికాలోని పలు రాష్ట్రాలు మంచు గుప్పెట్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచు తుఫాను భీబత్సం సృష్టిస్తుంది. మంచు తుఫాను ధాటికి పలు విమానాలను రద్దు చేసారు. అమెరికా వెళ్లాల్సిన వారి ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. అక్కడ అమెరికాలోని సూపర్ మార్కెట్ లో సరుకులన్నీ మంచు తుఫాను ప్రభావంతో ఖాళీ అవుతున్నాయి అంటే మోతాదుకు ముంచి ఇంటికి తెచ్చేకుని నిలవ వేసుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో అమెరికా వెళ్లిన చాలామంది తెలుగు వారు, అక్కడే స్థిరపడిన వారు మంచు లో పడి డ్యాన్స్ లు వేస్తూ మంచు లో ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు పాటలకు వారు మంచులో వేసే డాన్స్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన టాలీవుడ్ యంగ్ నిర్మాత నాగవంశీ అమెరికా మంచు లో డాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేసేవారిపై ఇండైరెక్ట్ గాసెటైర్ వేశారు.
అంటే Telugu cinema lo inni snow songs unnayi ani dallas lo snow padithe kani teliyaledhu naku 😂🙏అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం యుఎస్ లో ఉన్న నాగవంశీ అక్కడ తెలుగు సాంగ్స్ కు డాన్స్ చేస్తూ మంచులో పడి కొట్టుకుంటున్నవారిని ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశారన్నమాట.