సంక్రాంతి సీజన్ ముగిసింది. తదుపరి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. స్కూళ్లు...కాలేజీలు అన్నింటికి సెలవుల సీజన్ కాబట్టి ఈ సీజన్ లోనే పెద్ద ఎత్తున రిలీజ్ లు ఉంటాయి. ఎండల తీవ్రత ముదరకముందే రిలీజ్ చేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నాయి. మార్చి 27న పాన్ ఇండియాలో రామ్ చరణ్ `పెద్ది` రిలీజ్ తేదీని లాక్ చేసారు.
ఆ ముందు రోజే అంటే మార్చి 26న నాని నటిస్తోన్న `ది ప్యారడైజ్` డేట్ ను లాక్ చేసారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే సమ్మర్ వీటితోనే మొదలవుతుంది. మరి ఈ రెండు సినిమాలకు రిలీజ్ ఆస్కారం ఉందా? అంటే `పెద్ది` కారణంగా ప్యారడైజ్ వాయిదా పడుతుందనే ప్రచారంఇప్పటికే జరుగుతోంది. అలాగే ఈ సినిమా ఇంకా ఆన్ సెట్స్ లో ఉంది. 60 శాతమే షూటింగ్ పూర్తయింది. మిగతా భాగం షూటింగ్ మార్చిలోగా ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేయాలి.
కానీ సమయం చూస్తే అంత లేదు. రెండు నెలలు కూడా చేతిలో లేదు. ఈ క్రమంలో ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్త వినిపిస్తోంది. అలాగే `పెద్ది` కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. క్లైమాక్స్ వచ్చిందనే ప్రచారం తప్ప అందులో వాస్తవం తెలియదు. ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకూ వచ్చాయి అన్నది క్లారిటీ లేనదు. ఈ నేపథ్యంలో `పెద్ది` వెనక్కి తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఒకవేళ ఈ రెండు సినిమాలు చెప్పిన తేదీకి రాకపోతే? `ఉస్తాద్ భగత్ సింగ్` తో పవన్ కళ్యాణ్ దిగిపోయే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి, మార్చికల్లా ఆ పనులు పూర్తవుతాయి. అదే జరిగితే ఏప్రిల్ లో ఉస్తాద్ గెట్ రెడీ అంటాడు.