రాఘవ లారెన్స్ `కాంచన 3`లో నటించింది నిక్కీ తంబోలీ. ఆ తర్వాత టాలీవుడ్‌లో కమెడియన్ ధనరాజ్ నటించిన `చీకటి గదిలో చితక్కొట్టుడు` లాంటి చిన్న సినిమాలో నటించింది. తనదైన అందం, హాట్ అప్పీల్ తో కుర్రకారు హృదయాలను దోచేసిన ఈ బ్యూటీ బిగ్ బాస్ 15 (హిందీ) హౌస్ లో చాలా సందడి చేసింది. ఖత్రోంకి ఖిలాడీ టీవీ సిరీస్ తోను పాపులారిటీ తెచ్చుకుంది.
అయితే ఇటీవల ఈ బ్యూటీ తన బుల్లితెర సహనటుడు అర్బాజ్ పటేల్ ని పెళ్లాడబోతోంది! అంటూ ప్రచారం సాగుతోంది.
తాజా సమాచారం మేరకు.. ఈ జంట పెళ్లికి రెడీ అవ్వాలంటే, ఏదైనా రియాలిటీ షో విన్ అవ్వాలని ఒక వింత షరతు పెట్టుకున్నారట. ది 50 అనే వెబ్ షోలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. దీనికి కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ఫరా ఖాన్ హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షోలో మొత్తం 50 పార్టిసిపెంట్స్ ఉంటారు. అయితే దీనిని ఇద్దరిలో ఎవరో ఒకరు విన్ అయితే ఈ జంట వెంటనే పెళ్లికి రెడీ అవుతుందట. కానీ 50 మందిలో విజేత ఎవరో తేలాల్సి ఉంటుంది. 1 ఫిబ్రవరి 2026 నుంచి ఈ షో కలర్స్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది.