యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు. హీరోగా హిట్ అందుకుని ఐదారేళ్లు అవుతుంది. చివరిగా `భీష్మ`తో సక్సెస్ కొట్టాడు. ఆతర్వాత ఏడు ప్లాప్ లు ఎదురయ్యాయి. వీటిలో చాలా సినిమాలు డిజాస్టర్లగా నమోదయ్యాయి. దీంతో నితిన్ మార్కెట్ డౌన్ అయింది. మరోవైపు సక్సెస్ పుల్ దర్శకులు సెట్ అవ్వడం లేదు. హిట్ దర్శకుడిని పట్టుకుందామంటే? వాళ్ల కమిట్ మెంట్స్ తో వాళ్లు బిజీగా ఉంటున్నారు.
ఈనేపథ్యంలో వి. ఐ ఆనంద్ తో తాజాగా ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఆనంద్ కూడా వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. గత సినిమా `ఊరు పేరు భైరవ కోన`తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు ఇతడు స్పెషలిస్ట్. `ఎక్కడికి పోతావు చిన్నవాడా`? అంటూ మరో హిట్ కూడా ముందే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన ప్రయత్నాలేవి కలిసి రాలేదు.
మాస్ రాజా రవితేజ తో `డిస్కోరాజా` అంటూ ఓ కమర్శియల్ అటెంప్ట్ చేసాడు. కానీ సక్సస్ అవ్వలేదు. దీంతో సీనియర్ హీరోలతో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం చేతిలో ఉంది నితిన్ సినిమా ఒక్కటే. ఈ నేపథ్యంలో ఈ విజయం హీరో కం డైరెక్టర్ ఇద్దరికీ కీలకమై. ప్లాప్ ల్లో ఉన్నప్పుడు కొట్టే హిట్ అసలైంది. మంచి అవకాశాలకు ఛాన్స్ ఉంటుంది. ఇద్దరి కలయిక ఎలా జరిగింది అన్నది తెలియదు గానీ.. హిట్ మాత్రం ఇద్దరి లైఫ్ ని టర్న్ చేయగలదు. మరి నితిన్ తో ఆనంద్ తన స్టైల్ మిస్టికల్ ప్రయత్నం చేస్తున్నాడా? మరో కమర్శియల్ అటెంప్ట్ చేస్తున్నాడా? అన్నది చూడాలి.