సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువే. హిట్ కాంబినేషన్లు, లక్కీ హీరోయిన్ల పై నిరంతరం చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ విజయాల వెనుక నటి కేథరిన్ థ్రెసా హైలైట్ అవుతోంది. ఆ మూడు విజయాల వెనుక క్యాథరీన్ కీలకంగా మారిందంటున్నారు. వివరాల్లోకి వెళ్తే. చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సాధించిన మూడు భారీ విజయాలివే.
`ఖైదీ నం. 150`, `వాల్తేరు వీరయ్య`, `మన శంకర వరప్రసాద్ గారు`. ఈ మూడు సినిమాలతోనూ క్యాథరీన్ కు సంబంధం ఉంది. అదెలా అంటారా? `వాల్తేరు వీరయ్య`, `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రాల్లో కేథరిన్ కీలక పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. చిరంజీవికి హీరోయిన్ కాకపోయినా? నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు.
చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర పోషించినా? ఆ గుర్తింపు వేరుగా ఉంటుంది. దీంతో ఏ హీరోయిన్ చిరు సినిమాలో ఛాన్స్ అంత ఈజీగా వదులకోదు. ఆ రంకగా క్యాథరీన్ చిరు సినిమా అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని లక్కీ ఛార్మ్ గా మారింది. ఈ రెండు సినిమాల కంటే ముందే అమ్మడు చిరంజీవి కంబ్యాక్ చిత్రం `ఖైదీ నెండర్ 150` లోనూ ఓ కీలక పాత్రకు అనుకున్నారు. ఆడిషన్ కూడా చేసారు.
కానీ ఎందుకనో చివరి నిమిషంలో ఆమెను తప్పించారు. ఆమె స్థానంలో లక్ష్మీ రాయ్ ని తెచ్చారు. కానీ ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 150 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రమిది. అప్పుడు ఛాన్స్ కోల్పోయినా? తర్వాత నటించిన చిరు రెండు చిత్రాల్లోనూ బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంది. ఈ మూడు సినిమాల విజయాల్లో క్యాథరీన్ పేరు స్పెషల్ గా ఫోకస్ అవుతోంది.