వెబ్ సీరీసుల్లో ఫ్యామిలీ డ్రామా, లవ్ డ్రామా కన్నా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ కి ఓటీటీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఏ లాంగ్వేజ్ లో తెరకెక్కే వెబ్ సీరీస్ అయినా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు. ఈకోవలోకి తాజాగా బాలీవుడ్ లో తెరకెక్కిన తస్కరి వెబ్ సీరీస్ నిలుస్తుంది. ఎయిర్ పోర్ట్ లో జరిగే స్మగుల్స్ నేపథ్యంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తస్కరి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.
తస్కరి వెబ్ సీరీస్ స్టోరీ : ప్రతి ఎయిర్ పోర్ట్ లో సాధారణ ప్రయాణికుల తో పాటుగా స్మగుల్ గూడ్స్ కష్టమ్స్ చెల్లించకుండా అంటే బంగారు బిస్కెట్స్, కాస్ట్లీ వాచ్ లు, ఖరీదైన బ్యాగ్స్ ని కస్టమ్స్ కి చిక్కకుండా కాపాడే ప్రయాణీకులు ఉంటారు. కొంతమంది ఎయిర్ పోర్ట్ చెకింగ్ లో పట్టుబడితే కొంతమంది ఎయిర్ పోర్ట్ అధికారులతో కుమ్మక్కై చల్లగా జరుకుంటారు. అలా ముంబై ఎయిర్ పోర్ట్ లో జరిగే అక్రమ స్మగుల్ గూడ్స్ ని అర్జున్ మీనా(ఇమ్రాన్ హష్మీ) అండ్ టీమ్ ఎలా పట్టుకుంది, చౌదరి సిండికేట్ ని అర్జున్ మీనా టీమ్ ఎలా విచ్ఛిన్నం చేసింది అనేది తస్కరి ప్రధాన కథ.
సస్పెండ్ అయిన త్రిమూర్తులు అర్జున్ మీన, రవీందర్ గుజ్జర్, మిథాలీ లు ప్రకాష్ అనే నిజాయితీగల ఆఫీసర్ ఎంట్రీ తో మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. ఎవరి సోర్స్ తో వారు కష్టమ్స్ డ్యూటీ కట్టకుండా బంగారం, వాచ్ లను తరలించే వారిని పట్టుకుంటూ ఉంటారు. మరోపక్క బంగారాన్ని పెద్ద మొత్తంలో స్మగుల్ చేసే చౌదరి సిండికేట్ ఎయిర్ పోర్ట్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని మలేషియా, బ్యాంకాక్ లాంటి దేశాల నుంచి అధిక మొత్తంలో బంగారాన్ని స్మగుల్ చేస్తూ ఉంటారు. దీనిని అర్జున్ మీనా అండ్ టీం ఎలా అడ్డుకుంది, ఆ క్రమంలో ఎలాంటి సమస్యల్లో పడింది అనేది ఎమోషనల్ గా కథను నడిపించిన తీరు అభినందనీయం.
కష్టమ్స్ ఆఫీసర్ గా ఇమ్రాన్ హష్మీ, అనురాగ్ సిన్హా ఆఫీసర్ గా ప్రకాష్ పాత్రలో బాగా నటించారు , నందీష్ సంధు, అమృత ఖాన్విల్కర్ పాత్రలు పవర్ ఫుల్ గా కనెక్ట్ అయితే విలన్ గా చౌదరి కేరెక్టర్ లో శరద్ కేల్కర్ బడా చౌదరిగా అద్దరగొట్టేసారు. ఎయిర్ హోస్టెస్, అలాగే సోర్స్ గా ప్రియా నటన బావుంది.
ఇక ఈ సీరీస్ కి మెయిన్ హైలెట్.. నేపధ్య సంగీతం. నీరజ్ పాండే ఓటీటీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ తస్కరి వెబ్ సీరీస్ ని రూపొందించారు. కొన్ని ఎపిసోడ్ లో ల్యాగ్ అలాగే కొత్త కొత్తగా ఎంటరయ్యే నటుల విషయంలో కన్ఫ్యూజన్ తప్ప ఈ వెబ్ సీరీస్ లో బోర్ కొట్టే అంశాలేవీ ఉండవు. ఓటీటీ ఆడియన్స్ కి నీరజ్ పాండే మాంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ అందించారనడంలో అతిశయోక్తి లేదు.