దాదాపు 150కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశంలో మన స్టార్లు నటించే సినిమాలను చూస్తున్న వారి సంఖ్య కేవలం 11 శాతం మాత్రమేనని సర్వే చెబుతోంది. దీనిని బట్టి 15 కోట్ల మంది మాత్రమే థియేటర్లకు వస్తున్నారు. మిగతా 135 కోట్ల మందిని థియేటర్లకు రప్పించలేని దుస్థితి మన దేశంలో ఉంది. అయితే 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ ను నైజాంగా మార్చాలనే టాలీవుడ్ స్టార్ల తపన నిజంగా హర్షించదగినది. నైజాంలో ఏదైనా సినిమా ఉత్తమంగా ఆడితే బాక్సాఫీస్ వద్ద 30కోట్లు సునాయాసంగా వసూలు చేయగలదు.
అలా జపాన్ కూడా మారితే అది గొప్ప పరిణామం. ఇటీవల బాహుబలి ఫ్రాంఛైజీతో పాటు ఆర్.ఆర్.ఆర్ జపాన్ లో అద్భుతంగా ఆడింది. అందుకే అల్లు అర్జున్ `పుష్ప 2`ని కూడా అక్కడ బంపర్ హిట్ చేయాలని తపిస్తున్నారు.
తన సినిమా పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఇప్పటికే అల్లు అర్జున్ కి భారీగా ఫ్యాన్స్ ఉన్నారని కూడా ప్రూవ్ అయింది. పుష్ప 2 మూవీ చూసాక ఫ్యాన్స్ అతడి మ్యానరిజమ్స్ ని అనుకరించడం మొదలైంది. తగ్గేదేలే! అంటూ బన్నీ అతడి కుటుంబానికి ఇటీవల జపాన్ లోని ఓ రెస్టారెంట్ లో అభిమానులు ట్రీటివ్వడం చర్చగా మారింది. ఇంతకుముందు ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లకు ఇలాంటి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రేసులో చేరాడు. పుష్ప 2 ఎంత వసూలు చేసింది? అనేదానికంటే, అక్కడ బన్ని ఎంత అభిమానం సంపాదించాడు? అన్నదే ముఖ్యం. జపాన్ పర్యటనలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, మాస్టర్ అయాన్, క్యూటీ అల్లు అర్హ కూడా ట్రిప్ లో ఉన్నారు.