Advertisement
Google Ads BL

రాజేంద్ర ప్రసాద్ - మురళి మోహన్‌ల‌కు పద్మశ్రీ


భారత ప్రభుత్వం 2026 రిప‌బ్లిక్ డే కానుక‌గా ప్రకటించిన పద్మ అవార్డుల్లో, ప్రముఖ తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్ -మురళి మోహన్‌లను ప్ర‌తిష్ఠాత్మ‌క‌ `పద్మశ్రీ` పురస్కారం లభించింది.

Advertisement
CJ Advs

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ దాదాపు 200 పైగా చిత్రాల్లో న‌టించిన మేటి హాస్య‌న‌టుడు. క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో తనదైన శైలి, సహజమైన అభినయం అత‌డి ప్ర‌త్యేక‌త‌లు. ప‌లు చిత్రాల‌లో ఎమోష‌న్ ని పండించిన న‌టుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా మంది సీనియ‌ర్లు అయ్యాక ఫేడ‌వుట్ అవుతుంటే, రాజేంద్రుడు నిత్య‌నూత‌నంగా త‌న‌ను తాను మ‌లుచుకుని వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. `హాస్య నటకిరీటి` అనే బిరుదుతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

సీనియ‌ర్ న‌టుడు మురళి మోహన్ .. 1970ల నుండి తెలుగు సినిమాల్లో కొన‌సాగుతున్నారు. దాదాపు 350 పైగా చిత్రాల‌లో న‌టించారు. తెలుగు దేశం పార్టీ తరఫున రాజకీయాల్లో ఉన్న ఆయ‌న‌ ప్రజాసేవలో కూడా గుర్తింపు పొందారు. నటనతో పాటు నిర్మాతగా, సామాజిక సేవకుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా జ‌య‌భేరి వ్యాపార సంస్థ‌ను లాభాల బాట‌లో న‌డిపించిన మేటి బిజినెస్ మేన్ గాను ముర‌ళి మోహ‌న్ కి గుర్తింపు ఉంది.

భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ప‌ద్మ‌శ్రీ ఒకటి. కళలు, సాహిత్యం, ప్రజాసేవ, విజ్ఞానం వంటి విభాగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తారు. ఈసారి ఇద్దరు ప్రముఖ తెలుగు నటులు ఈ గౌరవాన్ని అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.

Rajendra Prasad-Murali Mohan conferred Padmasri:

Indian Government honors Rajendra Prasad and Murali Mohan with Padmas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs