సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలే ఈవారం థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాల్లో రాజసాబ్, భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమాలు పూర్ పెరఫార్మెన్స్ చూపించగా.. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి సినిమాలు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.
ఇప్పుడు రెండో వారం లోకి ఎంటర్ అయ్యాక కూడా అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి చిత్రాల కోసం యూత్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. లాంగ్ వీకెండ్ కావడం శని, ఆది వారంతో పాటుగా సోమవారం రిపబ్లిక్ డే కావడంతో ఈ లాంగ్ వీకెండ్ ని కుర్ర హీరోలు క్యాష్ చేసుకుంటారనిపిస్తుంది.
బుక్ మై షో లో అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి తో పాటుగా మన శంకర వరప్రసాద్ బుకింగ్స్ కూడా బావున్నాయి. మరి ఈ వీక్ లోను ఈమూడు సినిమాలు క్యాష్ చేసుకోవడం గ్యారెంటీ, కారణం మరే ఇతర సినిమాలు ఈ వారం రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ కు ఈ వారం కూడా సంక్రాంతి సినిమాలే ఛాయస్ గా ఉన్నాయి.
సో ఈ వీకెండ్ విన్నర్ ఎవరో అనేది తెల్చాల్సిందే. సో ఈ వీకెండ్ కలెక్షన్స్ వచ్చే వరకు విన్నర్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.