Advertisement
Google Ads BL

ఆ రెండు సినిమాల మ‌ధ్య మెగా క్లాష్‌


పాన్ ఇండియాలో మ‌రో రెండు సినిమాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాయి?  రెండు సినిమాల మ‌ధ్య ట‌ప్ ఫైట్ త‌ప్ప‌దా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `ధురంధ‌ర్` ఎంత పెద్ద  విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఏకంగా 1300 కోట్ల వ‌సూళ్ల‌తో సింగిల్ లాంగ్వెజ్ చిత్రం గా స‌రికొత్త రికార్డు సృష్టించింది. దీంతో  `ధురంధ‌ర్ 2` పై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. బాక్సాఫీస్ బ‌రిలోఈ చిత్రం 2000 కోట్ల టార్గెట్ గా రిలీజ్ అవుతుంది. ఒక‌వేళ‌ ఆ నెంబ‌ర్ మిస్ అయినా? 1300 కోట్ల‌కు పైగా వసూళ్ల‌ను `ధురంధ‌ర్ 2` రాబ‌ట్టాలి.

Advertisement
CJ Advs

ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ సాగుతోంది. ప్రేక్ష‌కులు సైతం అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని  మార్చి 19న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఇదే రోజున మ‌రో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంది. స్థానికంగా అన్ని భాష‌ల్లోనూ ఆ సినిమా అనువాద రూపంలో రాబోతోంది. అదే రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా న‌టిస్తోన్న `టాక్సిక్`. తొలిసారి రిలీజ్ అయిన గ్లింప్స్ కి  పెద్ద‌గా క‌నెక్ట్ అవ్వ‌న‌ప్ప‌టికీ తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్ తో `టాక్సిక్` పై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. గీతూ మోహ‌న్ దాస్ హాలీవుడ్  మేకింగ్ స్టైల్ తో టీజ‌ర్ మార్కెట్ లోకి వ‌దిలింది.

యశ్ క్యార‌క్ట‌రైజేష‌న్ అంతే స్టైలిష్ గా హైలైట్ అయింది.  పాన్ ఇండియా లో అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రం  రిలీజ్ అవుతుంది. ఇప్పుడీ రిలీజ్ `ధురంధ‌ర్ 2`పై ప్ర‌భావం చూపేలా ఉంది. 1300 కోట్లు ప్ల‌స్ అన్న‌ది ఈసారి  ఈజీ కాదు.  తొలి భాగం కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగ రాసింది. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ యాక్షన్ , అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటన సినిమా విజయానికి ప్రధాన కారణ మయ్యాయి. ఇప్పుడు సీక్వెల్‌లో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడం ఆ చిత్ర బృందానికి ఓ పెద్ద సవాలుగా మారింది. హైప్ ఎంత ఉన్నా, ఒక సీక్వెల్‌ను నిలబెట్టాలంటే కథలో అంతకు మించిన దమ్ముండాలి.

టాక్సిక్ రిలీజ్ నేప‌థ్యంలో `ధురంధ‌ర్ 2` లో బ‌ల‌మైన కంటెంట్ ఉంటేనే ప‌న‌వుతుంది. అంత‌కు ముందు భారీగా థియేట‌ర్లు దొర‌కాలి. పోటీగా టాక్సిక్ కు రిలీజ్ కు ముంది కాబ‌ట్టి  థియేట‌ర్ల ఆక్యుపెన్సీ కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. దీంతో వ‌సూళ్లు చీలే అవ‌కాశం లేక‌పోలేదు. ప్ర‌త్యేకించి నార్త్ ఇండియాలో `టాక్సిక్` గట్టి ప్రభావం చూపి స్తుందని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. వీటిని బ్రేక్ చేసి  `ధురంధ‌ర్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాలి.

Dhurandhar 2 vs Toxic:

Ranveer Singh Dhurandhar 2 vs Yash Toxic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs