ప్రభాస్ ఫ్యాన్స్ టార్చర్ ని దర్శకుడు మారుతి తట్టుకోలేకపోతున్నాడు. సినిమా విడుదలయ్యాక మారుతి ని పెల్లెత్తిమాట అనని ప్రభాస్ ఫ్యాన్స్ రెండు వారు తిరిగేసరికి మారుతి ని టార్గెట్ చేసి ఏడిపిస్తున్నారు. రాజసాబ్ ఈవెంట్ లో అతి నమ్మకంతో మారుతి తన ఇంటి అడ్రెస్స్ చెప్పి సినిమా నచ్చకపోతే ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.
దానితో ప్రభాస్ ఫ్యాన్స్ జొమాటో, స్విగ్గి ఆర్డర్లు తో మారుతి కి నిద్ర లేకుండా చేస్తున్నారట. మారుతి కి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద తలనెప్పిగా మారారు అని, అందుకే మారుతి కి కొంతమంది సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ సలహాలు ఇస్తున్నారట, కొన్నాళ్ళు సైలెంట్ గా ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని చెబుతున్నారట.
కొద్దిరోజులు కనిపించకుండా సైలెంట్ గా ఉంటె ప్రభాస్ ఫ్యాన్స్ శాంతిస్తారని వారి ఉద్దేశ్యం కాబోలు. మరి రాజసాబ్ ప్లాప్ విషయంలో మారుతి ని ఒక్కడినే బ్లేమ్ చెయ్యకూడదు, ప్రభాస్ కూడా స్క్రిప్ట్ వినే కదా ఫైనల్ చేసాడు, అందులో నటించాడు, మారుతి ని మాత్రమే ఫ్యాన్స్ టారెట్ చెయ్యడం కరెక్ట్ కాదు అని మారుతి స్నేహితులు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.