రామ్ చరణ్ పెద్ది మార్చ్ 27 నుంచి వాయిదా పడబోతోందా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వినబడుతున్న న్యూస్. మార్చ్ 27 నుంచి రామ్ చరణ్-బుచ్చిబాబు ల పెద్ది పోస్ట్ పోన్ అయ్యి జూన్ కి వెళ్లబోతుంది అని కొందరు, కాదు అఖిల్ లెనిన్ డేట్ పై పెద్ది ఫోకస్ పెట్టింది అని మరికొందరు అంటున్నారు.
మరోపక్క పెద్ది మార్చ్ 27 నుంచి తప్పుకుంటే ఆ తేదీని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఖాయం చేస్తుంది అని ఇంకొందరు అంటున్నారు. పెద్ది రిలీజ్ డేట్ పై ఎప్పుడు ఊహాగానాలు కనిపించినా వెంటనే మేకర్స్ పెద్ది రిలీజ్ డేట్ పై ఎలాంటి దిగులు పడొద్దు, మార్చ్ 27నే సినిమా విడుదల అంటూ లైన్ లోకి వచ్చేస్తారు.
కానీ ఈసారి పెద్ది దర్శకనిర్మాతలు సైలెంట్ అయ్యారు, పెద్ది విడుదల తేదీపై వినబడుతున్న ఊహాగానాలకు అడ్డుకట్టవెయ్యడం లేదు, మరోపక్క సంక్రాంతి వెళ్ళగానే పెద్ది సెకండ్ సింగిల్ సిద్దమవుతుంది అన్నారు. మరి పెద్ది రిలీజ్ డేట్ వాయిదా వార్తల నేపథ్యంలో సెకండ్ సింగిల్ విషయంలో మేకర్స్ కామ్ అవ్వలేదు కదా ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఆందోళనపెడుతున్న న్యూస్.