తెలుగులో వరుస అపజయాలు, తమిళనాట అయినా జెండా పాతుదామంటే అక్కడ కూడా క్యూట్ కృతి శెట్టి కి డెబ్యూ మూవీ షాకిచ్చింది. తమిళంలో స్టార్ హీరో కార్తీ తో కలిసి నటించిన వా వాతియార్ మూవీ ఎన్నో అడ్డంకులు దాటుకుని కి హడావిడిగా విడుదల కాగా.. ఈ చిత్రానికి తమిళనాట నెగెటివ్ టాక్ రావడంతో సినిమా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.
దానితో కృతి శెట్టి ఆశలు అడియాశలైనాయి. తమిళ డెబ్యూ తో బలంగా కోలీవుడ్ లో పాగా వేద్దామనుకుంటే ఆ సినిమా షాకిచ్చింది. ఇక ప్రదీప్ రంగనాధన్ తో కలిసి చేసిన LIK విడుదల కావాల్సి ఉంది. ఆ చిత్రమైనా కృతి శెట్టి కి విజయాన్ని అందించాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఈమధ్యన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న కృతి శెట్టి తాజాగా వదిలిన పిక్స్ చూస్తే ఇంత అందం ఉంది, ఇంత గ్లామర్ ఉంది.. దేవుడా కూసింత అదృష్టన్ని ఇవ్వరాదు అంటూ వేడుకోవాలనిపిస్తుంది. నిజంగా కృతి శెట్టి న్యూ లుక్ చూస్తే అయ్యో పాపం అమ్మడుకు అదృష్టం ఎక్కడ దాగుందో అని జాలి పడాల్సిందే. అసలే ఈమధ్యన కృతి శెట్టి బాలీవుడ్ డెబ్యూ ని కీర్తి సురేష్ తన్నుకుపోయింది అనే టాక్ ఉంది.