నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ తాండవం రిలీజ్ కి ముందే వీరసింహ రెడ్డి తో హిట్ అందించిన గోపీచంద్ మలినేని తో NBK111మూవీ ని అనౌన్స్ చేశారు. పిరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న NBK111 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే నటుల ఎంపిక, హీరోయిన్ గా నయనతార పేరు అనౌన్స్ చెయ్యడం అన్ని క్రేజీగా జరిగాయి.
అఖండ 2 తర్వాత NBK111 ప్రాజెక్ట్ పై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్న సమయంలో NBK111 పై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. NBK111 కి సంబందించిన ఫైనల్ స్క్రిప్ట్ ని గోపీచంద్ లాక్ చేసాడు అని, బాలయ్య NBK111 ఫుల్ స్క్రిప్ట్ పై హ్యాపీ అని సమాచారం. ఇక రెగ్యులర్ షూట్ కి వెళ్లడమే తరువాయి అంటున్నారు.
అయితే ముందు అనుకున్న పియాడికల్ డ్రామా కాదని, ఇప్పుడు సోషల్ కథతో NBK111 తెరకెక్కుతుంది అని సమాచారం. గోపీచంద్ ఎప్పుడు అంటే అప్పుడే సెట్ లోకి వెళ్లేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారట. సో NBK111 ప్రాజెక్ట్ పై నందమూరి ఫ్యాన్స్ కి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదన్నమాట.