నిన్నటివరకు రాజసాబ్ ప్లాప్ అంటున్నా ప్రభాస్ అభిమానులు చాలా సంయమనంతో ఉన్నారు. సోషల్ మీడియాలో రాజసాబ్ రిజల్ట్ పై పేలుతున్న జోక్స్ ని తిప్పికొట్టారు. కానీ ఇప్పుడు రాజసాబ్ ఫెయిల్యూర్ కి కారణం దర్శకుడు మారుతి నే అంటూ ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా టోన్ మార్చడంపై సర్వత్రా విస్మయానికి గురవుతున్నారు.
రాజసాబ్ ఫెయిల్యూర్ కి కారణం మారుతి నే అని చాలామంది కాదు కాదు ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా మాట్లాడుతున్న మాట. మారుతి దర్శకత్వ లోపాలే ఈ సినిమా ప్లాప్ కి మెయిన్ రీజన్ అంటున్నారు. ప్రొడ్యూక్టన్ వాల్యూస్ కానీ, ప్రభాస్ కానీ కారణం కాదు మొత్తం మారుతి దే లోపం అంటూ నెపం మొత్తం మారుతి పై నెట్టేస్తున్నారు. మరోపక్క మారుతి ని సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ వల్ల మారుతి కి ఇప్పుడు సింపతీ పెరుగుతుంది. అదెలా అంటే..
#Rajasaab flop కి కారణం #Maruthi మాత్రమే కాదు.
నాకు ఇలాంటి కథే కావాలి అని దగ్గరుండి రాయించుకున్నాడు #Prabhas
హీరోయిన్స్ ఛాయస్ కూడా హీరోదే.
ఎడిటింగ్ అంతా #Prabhas ఆధ్వర్యంలో జరిగింది.
#Maruthi ఒక గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్నాడన్నది మాత్రం నిజం.
కానీ ఇన్ని రాళ్లు వేయాల్సిన అవసర లేదు. ప్రభాస్ తో సినిమా కల నెరవేరినా.. ఆయనకు గొప్ప రిజల్ట్ ని ఇవ్వలేకపోయాను అని మారుతి బాధపడుతున్నాడు. అలాంటి వాడిని ఇంకా ఇంకా కొట్టి చంపడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో మారుతి ని సపోర్ట్ చేసే వారు ఎక్కువయ్యారు.