Advertisement
Google Ads BL

నారా లోకేష్ - సరైన నాయకుడు


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన స్వర్గీయ ఎన్ఠీఆర్ మనవడు 

Advertisement
CJ Advs

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబునాయుడి తనయుడు 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కం యాక్టర్ అయిన బాలయ్య అల్లుడు 

నారా లోకేష్ బాబు 

ఇదీ 2017 వరకూ అతనికి వున్న గుర్తింపు. అయితే అప్పటివరకూ పార్టీ కార్యకర్తగానే పనిచేసిన లోకేష్ ఆ ఏడాది ఐటీ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల కేబినెట్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టి అక్కడినుంచి తన పదును చూపడం ప్రారంభించారు. కర్తవ్య నిర్వహణలో చురుకుగా వ్యవహరిస్తూ ఇటు గ్రామీణాభివృద్ధికి శ్రమించారు. అటు విదేశీ పెట్టుబడిదారులనూ ఆకర్షించారు. మొత్తంగా చూసుకుంటే ఎటువంటి అనుభవం లేకుండానే మినిస్టర్ పోస్ట్ పొందిన లోకేష్ తన పదవికీ, ఆ పదవి పట్ల చేసిన ప్రమాణానికీ కడదాకా కట్టుబడే ఉన్నారని చెప్పాలి. అయితే తదుపరి ఎన్నికల్లో ప్రభుత్వ మార్పు కోరుకున్న ప్రజలు తనకి మరో అవకాశం ఇవ్వకపోయినా ప్రజా సేవలో నిరీక్షణ కూడా ఒక భాగమే అని భావిస్తూ యువ గళం పాదయాత్రతో ప్రజలకు మరింతగా దగ్గరయ్యారు లోకేష్. ఆతర్వాత 2024 ఎన్నికల్లో సత్తా చాటి ఎమ్యెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్రానికి విధ్యా, ఐటి శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు. ఇది తనలోని ఒక కోణం మాత్రమే.! నరేంద్ర మోదీ పేరుని షార్ట్ కట్ లో నమో అన్నట్టు నారా లోకేష్ తన పేరుని నాలో అనుకుంటూ తనని తానే మార్చుకుంటూ, మలుచుకుంటూ, తన భవిష్యత్తుని తానే నిర్మించుకుంటూ వస్తోన్న మరో కోణం కూడా ఉంది. 

రాజకీయ ప్రత్యర్ధులు లోకేష్ ని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు.

ఆ స్థాయికి తాను దిగజారలేక ఇతను మౌనంగా ఉంటాడు.

ఎన్నికల్లో ఓడిపోయావ్ అంటూ హేళన చేస్తుంటారు.

ఇంకా గతంలోనే బతికే మీకు, నా భవిష్యత్ తెలియదులే అని మనసులో అనుకుంటాడు.

అవతలి వాళ్ళ ప్రోద్భలంతో ఇతనిపై సెటైర్లు వేసేవాళ్లున్నారు. సినిమాలు తీసేవాళ్లున్నారు.

కార్టూన్లు గీసేవాళ్లున్నారు. కాలు దువ్వేవాళ్ళూ ఉన్నారు.

లోకేష్ మాత్రం మీకిదే పనేమో, నాకు చాలా పనులున్నాయ్ అనుకుంటూ

ప్రజాదర్భార్ పెట్టి ప్రజా సమస్యలపై చర్చిస్తూ ఉంటాడు. పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతూ ఉంటాడు.

ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తుంటాడు. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. 

తనలోని ఈ కోణం తెలిసి వచ్చాకే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెగువ పెరిగింది.

సరైన నాయకుడే నడిపిస్తున్నాడనే సమాధానం దొరికింది.

విలేజ్ లో ఉన్న పార్టీ కార్యకర్తతోనూ.. విదేశాల్లో ఉన్న పార్టీ అభిమానితోనూ సరళంగా సంభాషించగల

సమయస్ఫూర్తి, సమన్వయం లోకేష్ లో ఉన్నాయి అంటున్నారు తన గురించి బాగా తెలిసిన సన్నిహితులు.

తెలియనివాళ్లకు మాత్రం అతనేంటో అర్ధం అయ్యే రోజు అతి త్వరలోనే వస్తుంది అంటున్నారు అభిమానులు.

ఈరోజు ఏపీ విద్య లో కానివ్వండి, ఐటి రంగంలో కానివ్వండి ముందుకు దూసుకుపోతుంది అంటే దానికి కారణం మన నారా లోకేషే అనే భావనలోకి ఏపీ ప్రజలు వచ్చేసారు. ఏపీ ని అగ్రస్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తూ.. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు రేయింబవళ్ళు కష్టపడుతూ.. తాజాగా దావోస్ పర్యటన ముగించుకుని వస్తోన్న యువ నాయకుడు, మినిస్టర్ నారా లోకేష్ కి ప్రజల తరపున, పార్టీ శ్రేణుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.

Nara Lokesh Birthday Special:

Happy Birthday to Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs