జనవరి 9 పొంగల్ రేస్ లో హీరో విజయ్ లాస్ట్ మూవీ జన నాయకన్ విడుదల అయితే, ఈ మూవీ ని హిట్ చేసి విజయ్ కి గుర్తుండిపోయేలా సెండాఫ్ ఇద్దామని విజయ్ ఫ్యాన్స్ చాలా గట్టిగా ప్లాన్ చేసారు. కానీ సెన్సార్ బోర్డు వారి ఆశలపై నీళ్లు చల్లింది. విజయ్ ని ఇరకాటంలోకి నెట్టింది. కోర్టులు vs సెన్సార్ బోర్డు అన్న రేంజ్ లో జన నాయకుడు నలిగిపోతున్నాడు.
U/A సర్టిఫికెట్ వచ్చేసింది జనవరి 21 న సినిమాని విడుదల చేసుకోవచ్చు అన్నారు. కానీ సెన్సార్ బోర్డు మళ్ళీ అబ్జక్షన్ పెట్టి కోర్టుకు వెళ్ళింది. మరోపక్క బయ్యర్ల గోల, థియేటర్స్ యాజమాన్యాల ఒత్తిడి. అబ్బో జన నాయకన్ నిర్మాతలు మాములుగా నలిగిపోవడం లేదు. థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ అప్పు తెచ్చి వాటికి వడ్డీలు కడుతున్నారు.
సందట్లో సడేమియా అన్నట్టుగా ఈ మధ్యలో జన నాయకన్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ జన నాయకన్ విడుదల ఆలస్యమైతే కుదరదని, తాము అనుకున్న సమయానికి జన నాయకన్ స్ట్రీమింగ్ చెయ్యపోతే నష్టపోతామని వారు నిర్మాతలను బెదిరిస్తున్నారు.
మరి ఒకటి కాదు రెండు కాదు జన నాయకుడు కష్టాల సుడిగుండంలో తెగ నలిగిపోతున్నాడు. అది చూసి విజయ్ ఫ్యాన్స్ ఆందోళన ఎక్కువైపోతోంది.