యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తర్వాత వార్ 2 తో అభిమానులను ఘోరంగా డిజప్పాయింట్ చేసాడు. వార్ 2 రిజల్ట్ ఎలా ఉన్నా ఆ చిత్రంలో ఎన్టీఆర్ లుక్స్ పై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ ని తట్టుకోలేకపోయారు. ఆతర్వాత ఎన్టీఆర్ వెయిట్ తగ్గి బాగా సన్న పడిపోయారు. ఆ విషయంలోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనపడిపోయారు.
అయితే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కోల్డ్ తో సఫర్ అవుతున్నాడు. ఇక దేవర-నీల్ మూవీ మధ్యలో ఎన్టీఆర్ పలు యాడ్స్ లో కనిపించారు. జెప్టో, జ్యువెలరీ, బాంబినో యాడ్స్ లో సందడి చేసారు. అయితే ఎన్టీఆర్ యాడ్స్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ఆనందమే కానీ ఎన్టీఆర్ నటించే యాడ్స్ కానీ, ఆ యాడ్స్ లో ఎన్టీఆర్ లుక్స్ కానీ ఫ్యాన్ కి నచ్చట్లేదు.
తాజాగా ఎన్టీఆర్ బాంబినో అనే యాడ్ లో కనిపించారు. అది చూసాకే ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆ యాడ్స్ ఏంటి ఎన్టీఆర్ అన్నా.. ఒక్క యాడ్ కూడా ఇంట్రెస్ట్ గా లేదు, వాటి గురించి ట్వీట్ కూడా వెయ్యబుద్ది కావట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ చేస్తున్న యాడ్స్ విషయంలో ఎంతగా మధనపడుతున్నారో తెలుస్తుంది.