దర్శకుడు మారుతి రాజసాబ్ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చి దానికి భారీ బడ్జెట్ పెట్టి భారీగా తీశారు. ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ప్రభాస్ స్టామినా తో ఘోరమైన డిజాస్టర్ అవ్వకుండా ఎంతోకొంత నష్టాలను తగ్గించాడు. అయినప్పటికి రాజసాబ్ నష్టాలు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.
ముఖ్యంగా ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ రాజసాబ్ నష్టాల గురించి ట్రోల్స్ మొదలు పెట్టారు. రాజసాబ్ కి రూ.70 నుంచి రూ.80 కోట్ల నష్టాలు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చినా రాజసాబ్ సేవ్ అయ్యేది, కానీ ప్లాప్ టాక్ రాజసాబ్ నిర్మాతలను ముంచేసింది అంటున్నారు. ప్రభాస్ స్టామినా ఎంతగా కలిసొచ్చినా ఈ 70 నుంచి రూ.80 కోట్ల నష్టాలు తప్పవు అంటున్నారు.
ఆల్మోస్ట్ రాజసాబ్ థియేట్రికల్ రన్ ముగిసినట్టే. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి చిత్రాలు హిట్ అవడంతో రాజసాబ్ కి మరింత దెబ్బపడింది.