మన శంకర వరప్రసాద్ సక్సెస్ జోష్ లో దుబాయ్ వెళ్లిన మెగాస్టార్ నిన్న బుధవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ రాగానే వరప్రసాద్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంటారు. మన శంకర వరప్రసాద్ గారు హిట్ అటు బయ్యర్లను, ఇటు మెగా ఫ్యామిని చాలా సంతోషపరిచింది.
చిరు కి చాలా కాలం తర్వాత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తగలడం, ఫస్ట్ వీక్ లోనే రూ300 కోట్ల క్లబ్బులోకి రావడం అన్నీ చిరు ను బాగా సంతోషపెట్టాయి.
ఇదే ఉత్సాహంలో మరుగున పడిపోయిన విశ్వంభరను పైకి తెమ్మంటున్నారు మెగా ఫ్యాన్స్. గత ఏడాది నుంచి పోస్ట్ పోన్ లోనే ఉన్న విశ్వంభర ఈ సమ్మర్ అంటున్నా ఆ విడుదల తేదీ పై స్పష్టత లేదు. వసిష్ఠ ఏ విధంగానూ విశ్వంభర అప్ డేట్స్ ఇవ్వట్లేదు. గత ఏడాది శ్రీరామనవమికి వదిలిన ఫస్ట్ సింగిల్ కూడా మోగలేదు.
సీజీ వర్క్ పై ఫోకస్ పెట్టిన టీమ్ అది ఎక్కడివరకు వచ్చిందో తేల్చడం లేదు. మన శంకర వరప్రసాద్ సక్సెస్ ఊపులో విశ్వంభర ఆప్ డేట్స్ ఇస్తే సినిమాకి క్రేజ్ మొదలవుతుంది, లేదంటే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యాలంటే మాములుగా ఉండదు, వరప్రసాద్ హిట్ జోష్ లో విశ్వంభర ను కలిదలిస్తే వర్కౌట్ అవుతుంది అనేది మెగా ఫ్యాన్స్ బాధ.
అందుకే వరప్రసాద్ గారు కాస్త విశ్వంభర ను పట్టించుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ చిరు కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరోపక్క విశ్వంభర సీజీ వర్క్స్ అవుట్ ఫుట్ చూసుకున్నాక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారట.