మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించిన రిమ్మీసేన్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. పొగరున్న అమ్మాయిగా గ్లామరస్ ట్రీటిచ్చిన రిమ్మీ, ఇదే నా మొదటి ప్రేమలేఖ, నీ తోడు కావాలి లాంటి చిత్రాలలోను నటించింది. బాలీవుడ్ లో ధూమ్, హంగామా, గోల్ మల్ లాంటి బ్లాక్ బస్టర్లలోను నటించింది.
అయితే రిమ్మీ బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు కొనసాగిన తర్వాత సడెన్ గా మాయమైంది. దానికి కారణం ఈ రంగంలో పురుషాధిక్యత ఒక కారణమైతే, హీరోయిన్ ని కేవలం గ్లామర్ డాళ్‌గా మాత్రమే చూస్తుండటం తనకు నచ్చలేదని చెప్పారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అవకాశాలు ఉండకపోవడం వల్లనే పరిశ్రమ నుంచి వైదొలిగానని తెలిపారు.
ప్రస్తుతం దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్ గా రాణిస్తున్న రిమ్మీసేన్ అక్కడ వ్యాపారం ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఆ దేశంలో పన్నులు ఎడా పెడా పెంచేయరని, దానివల్ల వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుందని కూడా రిమ్మీ తెలిపారు. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ లాగా గౌరవిస్తారని అన్నారు. ఇటీవల తన ముఖాకృతిలో చాలా మార్సులు రావడానికి కారణం ప్లాస్టిక్ సర్జరీలు కాదని, బొటాక్స్, పీఆర్పీ, పిల్లర్స్ వంటి చికిత్సల కారణంగా ఇలా మారానని కూడా రిమ్మీ చెప్పారు.