ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఇద్దరు కుర్ర హీరోలు ఆడియన్స్ ను మెప్పించడంలో పోటీ పడ్డారు. అనగనగ ఒకరాజు తో నవీన్ పోలిశెట్టి, నారి నారి నడుమ మురారి తో శర్వానంద్ లు మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే అనగనగ ఒకరాజు రూ.100 కోట్లు కొట్టి నవీన్ పోలిశెట్టి ని క్రేజీగా మార్చేసింది.
గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సతమతమైన నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్ కి అనగనగ ఒకరాజు జీవం పోసింది. మరోపక్క శర్వానంద్ నారి నారి నడుమ మురారి హిట్టయ్యింది. శర్వా కి ఊరటనిచ్చింది. వారం తిరిగేసరికి బ్రేక్ ఈవెన్ అయ్యింది, ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సినిమాలకు ఎంత లాభాలొచ్చాయి అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం మాకు లాభాలతో సంబంధం లేదు, ఈ యువ హీరోలకు వచ్చిన హిట్ టాక్ చాలు.. శర్వా కైతే ఈ హిట్ చాలా కీలకం అయ్యింది. నవీన్ పోలిశెట్టి తన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేసాడు అది చాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.