మెగాస్టార్ చిరంజీవి అనూహ్యంగా ఈ సంక్రాంతి కి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర ప్లాప్స్ ని మరిపించేసింది ఈ వరప్రసాద్ హిట్టు. విడుదలై పది రోజులు అవుతున్నా మన శంకర వరప్రసాద్ గారు జోరు ఆగట్లేదు. ఫిస్ట్ వీక్ లోనే రూ.300 కోట్ల క్లబ్బులోకి చేరి ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆయన తదుపరి మూవీ మెగా 158 పై క్రేజ్ పెరిగిపోయింది. బాబీ కొల్లి డైరెక్షన్లో చిరు తన తదుపరి మూవీ చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ విషయంలో ఇక లెక్కలు లేవు అని నిర్మాతలు ధీమాతో ఉన్నారట. మరోపక్క తండ్రి-కూతురు సెంటిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది అని.. ప్రియమణి చిరు భార్య పాత్రలో కనిపిస్తుంది అంటున్నారు.
అంతేకాకుండా చిరు కి కూతురు గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది అనే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో మెగా 158 టీమ్ స్పందిస్తూ ఇంకా చిరు కూతురు పాత్రకి ఎవ్వరిని అనుకోలేదు, కృతి శెట్టి చిరు కూతురు పాత్ర పోషిస్తుంది అనే వార్తలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అయితే బాబీ మాత్రం చిరు మూవీ కోసం ఓ రేంజ్ లోనే ఖర్చు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.