Advertisement
Google Ads BL

బాలయ్య పరువు నిలబెట్టిన శర్వానంద్


నిజమే శర్వానంద్ నందమూరి బాలకృష్ణ పరువు నిలబెట్టాడు. ఎలా అంటే బాలయ్య నటించిన నారి నారి నడుమ మురారి చిత్ర టైటిల్ ని శర్వానంద్ వాడుకుని ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. బాలయ్య టైటిల్ తో రావడంతో నందమూరి అభిమానులు శర్వానంద్ నారి నారి నడుమ మురారి ని ఓన్ చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

సినిమాలోనూ విషయం కాదు కాదు కామెడీ బలంగా పండడంతో సినిమా హిట్ అయ్యింది. సంక్రాంతి సీజన్ లో రాకుండా వేరే వారం చూజ్ చేసుకున్నట్లయితే శర్వానంద్ నారి నారి మోత మాములుగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ టైటిల్ వాడుకుంటున్నామని నిర్మాతలు బాలయ్యకు ఫోన్ చేస్తే నా సినిమా ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు వాడుకుంటే ఏమవుతుంది వాడుకొమ్మన్నారని శర్వా నిర్మాతలు చెప్పారు.

తాజాగా శర్వానంద్ మాట్లాడుతూ నేను వేరే పని మీద బాలయ్య బాబుకి ఫోన్ చేసి, థ్యాంక్ యూ సార్, టైటిల్ ఇచ్చినందుకు, అంతేకాకుండా సినిమా బాగానే రన్ అవుతోంది అని చెప్పాను, దానికి బాలయ్య  ఏయ్, విన్నా. నా పరువు నిలబెట్టావ్.. అంటూ నాతో అన్నారు.. అంటూ శర్వానంద్ బాలయ్య టైటిల్ పై క్రేజీగా మట్లాడారు. 

Sharwanand Great Words About Balakrishna:

Sharwanand Reveals Balakrishna Response About Title in Naari Naari Naduma Murari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs