వచ్చే నెల అంటే ఫిబ్రవరి 26 న విజయ్ దేవరకొండ-రష్మిక ల వివాహం జరగబోతుంది. రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ జరగబోతుంది అనే ప్రచారం ఉంది. విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ ఇప్పటివరకు ఈ పెళ్లి పై రియాక్ట్ అవ్వడం లేదు.
అయితే రష్మిక కి చాలాసార్లు ఆమె పెళ్లి విషయమై ప్రశ్నలు ఎదురవుతున్నా.. నేను చెప్పినా మీరు వినరు, మీకు ఇష్టమైంది రాసుకుంటారు, చెప్పాల్సిన సమయమొస్తే చెబుతా అంటూ తప్పించుకుంటుంది. అలా తప్పించుకోకుండా అన్ని విషయాలు చెప్పేస్తే వారిపై న్యూస్ లు పుట్టవు, రాయరు, అందుకే రష్మీక-విజయ్ దేవరకొండ లు సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారని నెటిజెన్స్ మాట్లాడుతున్నారు.
ఇక రష్మిక-విజయ్ లు తమ పెళ్లి పనులు మొదలు పట్టేసారని, ఇప్పటికే సైలెంట్ గా ముంబై వెళ్లి పెళ్లికి సంబందించిన డ్రెస్సులు సెలెక్షన్స్ చేశారు, ప్రముఖ డిజైనర్ కంపెనీ కి తమ వెడ్డింగ్ దుస్తుల డీల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోపక్క బెంగళూరు నుంచి గులాబీల ఆర్డర్ వెళ్లిందట.
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లికి, డచ్ గులాబీల్ని పంపించబోతున్నట్టుగా శ్రీకాంత్ బొల్లేపల్లి రివీల్ చేసారు. మరి రష్మిక చెప్పకపోతేనేమి ఆమె పెళ్లి విషయాలు ఏదోలా మీడియాకి చేరుతూనే ఉన్నాయి.