నేచురల్ స్టార్ నాని తో సినిమా చేస్తే నిర్మాత ఒడ్డున పడిపోతాడు. ఇదే టాలీవుడ్ నిర్మాతల కాన్ఫిడెంట్. సేఫ్ గా సినిమాలు చేస్తాడు, నిర్మాతలకు లాభాలు తెస్తాడు. ఒకవేళ సినిమాలు యావరేజ్ అయినా నిర్మాత నష్టపోడు. అదే కాన్ఫిడెన్స్ నాని తన నిర్మాతలకు ఇస్తాడు. అంతేకాదు నిర్మాతల కోసం ఎంతోకష్టపడి సినిమాలను ప్రమోట్ చేసాడు నాని.
ఇప్పుడు అదే కోవలోకి మరో హీరో చేరాడు. ఆయనే నవీన్ పోలిశెట్టి. చేసింది నాలుగు సినిమాలే. నాలుగు సేఫ్ ప్రాజెక్ట్స్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఇప్పుడు అనగనగ ఒకరాజు. నాలుగు సినిమాలు వర్కౌట్ అయ్యాయి. అందుకు మెయిన్ రీజన్ నవీన్ పోలిశెట్టి నే.
కథ కన్నా కామెడీకి ఎక్కువ ఇంపోర్టన్స్ ఇవ్వడమే కాదు, ఆ సినిమాలను ఎలా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చెయ్యాలో అనేది నవీన్ పోలిశెట్టి కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అనేలా అతని ప్రమోషన్స్ ఉంటాయి. ఈ హీరో తో సినిమా చేస్తే బయటపడిపోతామనే నమ్మకాన్ని నవీన్ పోలిశెట్టి నిర్మాతలకు ఇస్తున్నాడు. అదే అతని సక్సెస్ మంత్ర.