అవును.. 2000 కోట్ల నికర ఆస్తులు ఉన్న అతడు సంపన్న వర్గాల్లో ఆదర్శ భర్తగా వెలిగిపోతున్నాడు. అతడు మరెవరో కాదు.. మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ. అతడు ప్రముఖ కథానాయిక అసిన్ కి భర్త అనే విషయం తెలిసిందే. మైక్రోమ్యాక్స్ మొబైల్స్ వ్యాపారాన్ని నష్టాల కారణంగా మూసివేసినా కానీ, నేటి ట్రెండ్ కి తగ్గ వ్యాపారాలతో భారీ లాభాలార్జిస్తున్న తెలివైన బిజినెస్ మేన్ గా రాహుల్ శర్మ సత్తా చాటుతున్నారు. అతడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అయినా కానీ, ఈరోజు 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి.
రాహుల్ శర్మ- అసిన్ జంట పెళ్లయి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతడు తన భార్యపై ప్రేమను చాటుకున్న తీరు సర్వత్రా చర్చగా మారింది. అతడు తన భార్యను సహవ్యవస్థాపకురాలు అని వ్యాఖ్యానించాడు. దీనర్థం తనకు చెందిన వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో అర్థభాగం అని అంగీకరించాడు. అంతేకాదు.. తన జీవితానికి, తన కుటుంబానికి అత్యంత కీలకమైన వ్యక్తి తన భార్య అని కీర్తించాడు.
ఏది ఏమైనా ఈరోజుల్లో ఆస్తి అంతస్తుల కోసం కొట్టుకు చచ్చే మొగుడు పెళ్లాలను చూస్తున్నాం. కానీ దానికి భిన్నంగా ఆదర్శ దాంపత్యంతో అసిన్ - శర్మ జోడీ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. గతంలో ఈ జంట విడాకులకు సిద్ధమవుతోందని వచ్చిన వార్తలు ఫేక్ అని మరోసారి నిరూపించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో అసిన్ ని శర్మకు పరిచయం చేసింది స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆ తర్వాత ఆ జంట ప్రేమాయణం ప్రారంభించి చివరికి 2016లో పెళ్లాడగా, వీరికి ఒక కుమార్తె జన్మించింది.
టెక్ దిగ్గజం రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ కి సహ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల వ్యాపారం ఆపేసి, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్ల విభాగంలో రాణిస్తోంది. రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ల కంపెనీని లాభదాయక వ్యాపారంగా మార్చిన టైమింగ్ తెలిసిన తెలివైనవాడు శర్మ అని నిరూపించాడు.