PK అంటే ప్రశాంత్ కిషోర్. రాజకీయ సలహాదారుడు. మేధావి. తన సలహాలతో తన దగ్గరికి వచ్చినవాళ్లను సీఎం లను చేసి మరీ వందల కోట్ల ఛార్జ్ చేసే ఈ మేధావి పార్టీ పెట్టి ఓడిపోయాడు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ని సీఎం ని చేసేందుకు వందల కోట్ల జీతం తీసుకుని తన సలహాలు సూచనలతో జగన్ ని సీఎం పీఠం ఎక్కించింది ఈ ప్రశాంత్ కిశోరె.
ఆతర్వాత నారా లోకేష్ కి కాంటాక్ట్ లోకి వచ్చి చంద్రబాబు ని సీఎం ని చేసాడు. ప్రశాంత్ కిషోర్ లోకేష్ వెనకుండి కథ నడిపించాడు అంటారు. ఈవిషయంలో స్పష్టత లేదు. కానీ నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ సలహాల కోసం వందలకోట్లు సమ్పరించాడనే టాక్ ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ సలహాలు మాములు కాస్ట్లీ కాదు.. అత్యంత ఖరీదైన సలహాలు అంటుంటారు.
జగన్, బాబు తర్వాత ఇప్పుడు తెలంగాణాలో కవిత కు సలహాలు ఇవ్వబోతున్నారా ప్రశాంత్ కిషోర్, లేదంటే కవిత ను PK కలవాల్సిన అవసరమేమిటి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి కొత్త పార్టీ సన్నాహాల్లో ఉంది. ఆమె కొత్త పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ సలహాలు, వ్యూహాలు రచించబోతున్నారా, ఒకవేళ ఇస్తే కవిత ప్రశాంత్ కిషోర్ ఫీజ్ కింద అంత పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తుంది.
ఇదే ఇప్పుడు కొంతమందిలో మెదులుతున్న ప్రశ్న. మరి కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ని ఎదుర్కోవాలంటే కవిత ఇంత బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మరా కాస్ట్లీ సలహాలు కవిత ను సీఎం ని చేస్తాయేమో, లేదో చూడాలి.