చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరు, బాలయ్యలతోను స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కాజల్ కి సక్సెస్ లు రావటలేదు, అవకాశాలు వస్తున్నాయి కానీ అద్భుతాలు జరగడం లేదు. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టడంతో కాజల్ కాస్త బబ్లీగా మారింది.
ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. కాజల్ తాజాగా వదిలిన వర్కౌట్ వీడియో చూస్తే అమ్మో కాజల్.. ఏంటి ఈ ఫిట్ నెస్ అంటూ కామెంట్లు పెడతారేమో. అంత నాజూగ్గా కనిపించడమే కాదు జిమ్ లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న జిమ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
జిమ్ వేర్ లో కాజల్ హాట్ గా కనిపించినా ఆమె ఫిట్ నెస్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. మీరు కాజల్ జిమ్ లుక్ పై ఓ కనెయ్యండి.