పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనపై వచ్చే సోషల్ మీడియా ట్రోల్స్ విషయంలో ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తనని సోషల్ మీడియాలో టార్గెట్ చేసే వారిపై ఫైర్ అయ్యింది. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. పవన్, అలాగే నా మీద ట్రోల్స్ చేసే వారికి ఒకటే చెబుతున్నాను, నన్ను ఏ విషయాల్లోకి లాగొద్దు, ఇష్టం వచ్చినట్టుగా నాపై తన్మైల్స్ పెట్టి న్యూస్ రాస్తే ఊరుకోను, నేను నా పిల్లల్తో ప్రశాంతంగా ఉన్నాను, అంటూ మండిపడింది.
ఇక ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తనకు మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చి చేజారినట్లుగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చిందని, కథతో పాటు పాత్ర కూడా నచ్చిందని చెప్పిన రేణు దేశాయ్ ఆ మూవీ లో నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పింది.
అయితే ఆ వ్యక్తిగత కారణాలు చెబితే అనవసర వివాదాలు చెలరేగుతాయని తెలిసి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రేణు చెప్పాలనుకున్న ఆ వ్యక్తిగత కారణాలేమిటో అంటూ నెటిజెన్స్ రకరకాలుగా ఊహించుకుంటున్నారు.