2026 కోలీవుడ్ కి పొంగల్ సీజన్ అస్సలు కలిసి రాలేదు. పెద్ద సినిమాలకు సెన్సార్ ప్రోబ్లెంస్, సమయానికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు సెన్సార్ ఇష్యుస్ తో అతలాకుతలం అయ్యాయి. విజయ్ జన నాయకన్ వాయిదా పడగా.. శివకార్తికేయన్ పరాశక్తి సెన్సార్ చిక్కులు వదిలించుకుని పొంగల్ రేస్ లో నిలిచింది.
శివకార్తికేయన్-శ్రీలీల జంటగా సుధా కొంగర తెరకెక్కించిన పరాశక్తి ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన కార్తీ వా వాతియార్ కూడా సెన్సార్ ఇబ్బందులతో ఎలాగో పొంగల్ కి విడుదల కాగా ఈ చిత్రము హిట్ టాక్ తెచ్చుకోలేక చతికిల పడింది.
పొంగల్ కి విడుదల కావాల్సిన జన నాయకన్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు, ఆ కన్ఫ్యూజన్ లోనే విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఎప్పుడు పొంగల్ కి కోలీవుడ్ కళకళలాడేది. కానీ ఈ పొంగల్ మాత్రం కోలీవుడ్ బోసిపోయింది.