యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్-నీల్ కాంబో మూవీ మొదలై అప్పుడే ఏడాది కావొస్తుంది. కానీ ఇప్పటికి ఎన్టీఆర్-నీల్ మూవీకి సంబందించిన అఫిషియల్ అప్ డేట్ మాత్రం మేకర్స్ ఇవ్వడం లేదు. అసలు షూటింగ్ జరుగుతుందా లేదంటే ఏం జరుగుతుంది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు.
రేపటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అనే అన్ అఫీషియల్ న్యూస్ తప్ప అధికారిక న్యూస్ లు లేవు. 2026 రిపబ్లిక్ డే కి సినిమా విడుదల అన్నారు, కానీ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అవుతుంది అనే ప్రకటన లేదు, సంక్రాంతికి ఎన్టీఆర్-నీల్ ఫస్ట్ లుక్ ని ఆశించారు అభిమానులు.
సంక్రాంతి వచ్చింది, వెళ్ళింది కానీ ఎన్టీఆర్-నీల్ మూవీ అప్ డేట్ జాడ లేదు, దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. మరోపక్క ఎన్టీఆర్ బర్త్ డే మే 20 వరకు డ్రాగన్(వర్కింగ్ టైటిల్) ఫస్ట్ లుక్ ఉండదు అనే ప్రచారం ఎన్టీఆర్ అభిమానులను మరింతగా ఆందోళనపెడుతుంది.