`ది రాజాసాబ్` విజయం సాధిస్తే మారుతి పేరు ఇండస్ట్రీ అంతటా మారుమ్రోగిపోయేది. దర్శకుడిగా అతడి ఇమేజ్ రెట్టింపు అయ్యేది. స్టార్ డైరెక్టర్ల లీగ్ లో చేరిపోయేవాడు. కానీ ఒక్క ప్లాప్ అతడి కెరీర్ నే డైలమాలో పడేసింది. మారుతి ముందున్న ఛాలెంజ్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వడం. చిన్న హీరోతో ముందుకెళ్తాడా? మరో స్టార్ హీరోని లాక్ చేయగలుగుతాడా? అన్నది చూడాలి. కానీ తమ్ముడికి అన్నయ్య ఛాన్స్ ఇవ్వడం మాత్రం ఇప్పట్లో జరిగేది కాదు.
ఇంతకీ ఎవరా? అన్నయ్య అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మారుతి డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మారుతితో కూడా ఓ సినిమా చేస్తానని పబ్లిక్ గా ప్రకటించారు. ఆ సమయంలో మారుతి ఆనందం తో ఉబ్బితబ్బిబాడు. చిరంజీవి పిలిచి అవకాశం ఇవ్వడంతో మంచి కథ రాసి అన్నయ్య ను మెప్పించి సక్సెస్ పుల్ సినిమా తీయాలనుకున్నాడు.
`ది రాజాసాబ్` తర్వాత చిరంజీవితోనే సినిమా చేయాలని మారుతి ఫిక్స్ అయ్యాడు అన్నది ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఏడాది కాలంగా కథపై వర్క్ చేస్తున్నాడుట. కానీ రాజాసాబ్ వైఫల్యం మారుతిని రేసులో లేకుండానే చేసింది. మారుతి ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ ముందుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ.
అన్నయ్య రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. కానీ చిరంజీవి అంత రిస్క్ తీసుకోలేరు. ఈ విషయంలో బాలయ్య , నాగార్జున లాంటి వారు డేర్ గా ముందుకెళ్తారు గానీ...చిరు మాత్రం వెళ్లే అవకాశాలు తక్కువ. మారుతికి అన్నయ్యతో ఛాన్స్ కావాలంటే? మరో స్టార్ తో బ్లాక్ బస్టర్ ఇస్తే తప్ప సాధ్యం కాదు. అంత వరకూ మారుతి వెయిటింగ్ లిస్ట్ లోనే.