చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన సక్సెస్ ని యువ హీరో శర్వానంద్ ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి రేస్ లో అస్సలు అంచనాలు లేకుండా వచ్చిన హీరో శర్వానంద్ నారి నారి నడుమ మురారి.. సంక్రాంతి చిత్రాలన్నిటిలో బిగ్ హిట్ గా నిలిచింది. నారి నారి నడుమ మురారి సినిమాకి హిట్ టాక్ వచ్చింది, అద్భుతం అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది,
కానీ కలెక్షన్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి. కారణం సంక్రాతి సీజన్ లో చివరి చిత్రంగా విడుదలైన నారి నారి నడుమ మురారి థియేటర్స్ నడుమ ఇరుక్కుపోయి అతి తక్కువ థియేటర్స్ ఖాయం చేసుకోవడంతో సినిమా హిట్ అనిపించుకున్నా కలెక్షన్స్ విషయంలో నష్టపోవాల్సిన పరిస్థితి.
సోషల్ మీడియా టాక్ తో జనాలు థియేటర్స్ కి వెళ్లడమే కాదు.. నారి నారి నడుమ మురారిలో తండ్రి కొడుకులుగా కనిపించిన శర్వానంద్-నరేష్ కామెడీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ విరగబడి నవ్వుతున్నారు. నారి నారి అంటే సాక్షి-సంయుక్త నడుమ చిక్కుకుని శర్వానంద్ పెద్దగా ఇబ్బందిపడకపోయినా, ఆ విషయంలో డిజప్పాయింట్ అయినా ప్రేక్షకులు కామెడీని యాక్సెప్ట్ చేస్తున్నారు.
సత్య, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నారి నారి నడుమ మురారి కి వెళ్ళండి, చక్కగా నవ్వుకోండి అంటూ సినిమా చూసి ప్రతిఒక్కరూ మౌత్ టాక్ తో సినిమాని లేపుతున్నారు.