వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) రోజున కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో పెళ్లికి సిద్ధమవుతోందంటూ వచ్చిన వైరల్ వార్తలపై నటి మృణాల్ ఠాకూర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ తప్పుడు ప్రచారానికి ఒక పరోక్ష పోస్ట్‌తో సమాధానమిచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో మృణాల్ ఎంతో ప్రశాంతంగా సముద్రపు ఒడ్డున ఒక బోటుపై షికార్ చేస్తూ కనిపించారు.
స్థిరంగా, వెలుగుతూ.. దేనికీ చలించకుండా! .. అంటూ క్రిప్టిక్ గా వ్యాఖ్యానించారు. దీనర్థం తన కెరీర్ జర్నీలో తనపై ఎలాంటి బురద జల్లినా తనను ఆపలేరనేది తన ఉద్ధేశం. దేనికీ చలించను! అంటూ ధృఢంగా వ్యాఖ్యానించారు. బహుశా మృణాల్ ని వ్యక్తిగతంగా, వృత్తి పరంగా దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రలు, కుయుక్తులకు కౌంటర్ ఇది అని అభిమానులు భావిస్తున్నారు.
సీతారామం, హాయ్ నాన్న, కల్కి 2898 ఏడి లాంటి క్రేజీ చిత్రాలతో విజయాల్ని అందుకున్న మృణాల్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చిలో అడివి శేష్‌తో కలిసి నటించిన `డెకాయిట్` రిలీజ్ కి రానుంది. ఈ సినిమాపై మృణాల్ చాలా హోప్స్ తో ఉంది. మృణాల్ నటించిన `దో దీవానే షెహర్ మే` అనే హిందీ చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం సాగిస్తున్నారని మృణాల్ చెప్పకనే చెప్పారు.