సంక్రాంతి సీజన్ అంటే క్రేజీ హీరోలు పోటీపడుతూ ఉంటారు. ఓ మాదిరి హీరోలు, యంగ్ హీరోలు, మీడియం బడ్జెట్ మూవీ ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సందేహిస్తారు. కానీ ఈసారి సంక్రాంతి సీజన్ లో యంగ్ హీరోలు ధైర్యం చేసారు. భారీ బడ్జెట్ సినిమాల్తో మిడ్ రేంజ్ హీరోలు పోటీపడి గెలిచారు.
ప్రభాస్ ది రాజసాబ్ వందలకోట్లతో తెరకెక్కింది. ఇప్పుడు దాని రికవరీ కోసం నానా తంటాలు పడుతోంది. మన శంకర వరప్రసాద్ గారు లిమిటెడ్ బడ్జెట్, తక్కువ షూటింగ్ డేస్ తో అనిల్ రావిపూడి మెగాస్టార్ కి గొప్ప సక్సెస్ ని అందించాడు, భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ మీడియం రేంజ్ బడ్జెట్ తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇక కుర్ర హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లు అంచనాలు లేకుండానే ఈ సంక్రాంతి సీజన్ కి వచ్చి బిగ్ హిట్ కొట్టారు. నారి నారి నడుమ మురారి పై అంచనాలు లేవు, అలాగని ప్రేక్షకులు హోప్స్ పెట్టుకోలేదు. కానీ శర్వానంద్ గతంలో శతమానంభవతి తో హిట్ కొట్టి ఇప్పుడు నారి నారి తో బిగ్ హిట్ కొట్టాడు.
ఇక మొదటిసారి సంక్రాంతి బరిలోకి దిగి హిట్ అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు తో మంచి హిట్ కొట్టాడు. మరి ఈ ఏడాది సంక్రాంతి విడుదలైన ఐదు సినిమాల్లో నాలుగు వర్కౌట్ అయ్యాయి. కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి యంగ్ హీరోలు ఎంతమంది కాన్ఫిడెంట్ తో ముందుకు వస్తారో చూడాలి.