ధనుష్ తో మృణాల్ ఠాకూర్ పెళ్లి, వచ్చే నెల 14 వాలెంటైన్స్ డే సందర్భంగా మృణాల్ ఠాకూర్ ధనుష్ తో రెండో పెళ్ళికి సిద్దపడింది. అది కూడా ఫ్యామిలీ మెంబెర్స్, అత్యంత సన్నిహితుల సమక్షంలో ధనుష్-మృణాల్ ల వివాహం జరగనుంది అనే వార్త బాలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా వరకు చక్కర్లు కొడుతోంది.
అది రూమరా, లేదంటే నిజంగానే ధనుష్-మృణాల్ వివాహం చేసుకోబోతున్నారా అనే విషయంలో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతుంటే.. ధనుష్-మృణాల్ ఠాకూర్ ఇద్దరూ ఈ పెళ్లి రూమర్స్ ని ఖండించడం లేదు, వారి మౌనం అర్ధాంగీకారం, వారి మౌనం అంగీకారం అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు.
మరి నిజంగానే సీక్రెట్ డేటింగ్ లో ఉన్న ధనుష్-మృణాల్ లు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారేమో, అందులో తప్పేమి లేదు, కానీ అదేదో చెబితే బావుంటుంది కదా అనేది నెటిజెన్స్ వాదన.