బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ కాబోయి రన్నర్ గా నిలిచిన ముద్ద మందారం సీరియల్ ఫేమ్ తనూజ ఆ సీరియల్ తర్వాత ఆమె మరో సీరియల్ లో కనిపించలేదు. తనూజ సీరియల్స్ చెయ్యకుండా ఆమె ఫోకస్ వెండితెరపై పెట్టినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. బిగ్ బాస్ కి వెళ్ళేముందు తానొక ఫిలిం పూర్తి చేసినట్టుగా చెప్పిన తనూజ బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆమె ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పింది.
అయితే తనూజ కు స్టార్ మా లోనే ఓ బిగ్ సీరియల్ ఆఫర్ ఉంది, అందుకే తనూజ ని విన్నర్ ని చెయ్యాలని స్టార్ మా బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయ్యింది అన్నారు. కానీ తనూజ ఇకపై సీరియల్స్ చెయ్యకూడదు అని డెసిషన్ తీసుకుందట. ఆమె సిల్వర్ స్క్రీన్ పై సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నదట.
అందుకు తగిన ప్రయత్నాలు స్టార్ట్ చేసింది అని, వెబ్ సీరీస్ లకి తనూజ సై అంటుంది అందుకే ఆమె సీరియల్స్ కి బ్రేక్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయమై తనూజ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ప్రస్తుతం స్టార్ మా సంక్రాంతి సంబరాల్లో తనూజ కళ్యాణ్ తో కలిసి డాన్స్ చేసింది. అంతే మళ్లీ సైలెంట్ అయ్యింది.