ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నిటికీ ఎంతోకొంత పాజిటివ్ టాక్ వచ్చింది. రాజసాబ్ కి కొంత నెగెటివ్ టాక్ పడినా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగో తంటాలు పడి మరీ డిజాస్టర్ కాకూండా కాపాడుతున్నారు. ఇక మన శంకర వరప్రసాద్ గారు కి హిట్ టాక్ వచ్చింది. భర్త మహాశయులకు యావరేజ్ టాక్ రాగా, అనగనగా ఒకరాజు కి హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ సీజన్ లో చివరిగా విడుదలైన నారి నారి నడుమ మురారి చిత్రానికి హిట్ కాదు సూపర్ టాక్ పడి.. అన్ని సినిమాల్లో బెటర్ మూవీ అనిపించుకుంది.
కానీ థియేటర్స్ తక్కువ ఉండడం, శర్వానంద్ ప్రమోషన్స్ సరిగ్గా చెయ్యకపోవడం.. నారి నారి నడుమ మురారి కి కలెక్షన్స్ తగ్గడానికి కారణమైంది. అందుకే ఓ మూవీ లవర్ సోషల్ మీడియా వేదికగా ఈపోస్ట్ పెట్టారు..
చిరంజీవి సినిమా అంటే డబ్బులెక్కువ రావడం కామన్..
సినిమా బాగోగులకు డబ్బులే ప్రామాణికం కాదు..
ఈ సంక్రాంతి సినిమాలన్నీ చూశాక.. ఏ సినిమా బాగుంది? అనే విషయంలో నా అభిప్రాయం..
ఈ సంక్రాంతి సినిమాల్లో ఏ లోపాలూ లేని కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్ అంటే.. అది శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమానే.. ఎక్సలెంట్ మూవీ... చిరంజీవిగారి సినిమా ఇప్పటికే చాలామంది చూసేసుంటారు కదా.. ఇక నారీ నారీ నడుమ మురారి చుడండి.. Out and out comedy... ఆసక్తి కలిగించే డ్రామా.. అసలు సిసలు సంక్రాంతి సినిమా.. 😊🙏🏼 అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.