మన శంకర వరప్రసాద్ సక్సెస్ ని మెగాస్టార్ చిరు ఆయన కుమార్తె సుష్మిత ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే.. సంక్రాంతి ఫెస్టివల్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. దర్శకుడు అనిల్ రావిపూడి, ఫ్రెండ్ హీరో వేంకటేష్ కి సరదాగా దోశె లు వేసి పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనకు డబ్బు కాదు ముఖ్యం ఫేమ్.
రాజకీయాల నుంచి సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వాల్తేర్ వీరయ్యతో సంక్రాంతి కి హిట్ కొట్టిన ఇంత జోష్ చిరు లో కనిపించలేదు. కానీ మన శంకర వరప్రసాద్ కి వస్తున్న కాంప్లిమెంట్స్ అలాంటి ఇలాంటి కాంప్లిమెంట్స్ కాదు మరి. చిరు వింటేజ్ స్టయిల్ ని మెగా ఫ్యాన్స్ కి చూపించిన అనిల్ రావిపూడి తెగ థాంక్స్ చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం అఫీషియల్ గా రూ.200 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది.
సినిమా విడుదల అయ్యి వారం కాదు కాదు ఫస్ట్ వీకెండ్ గడవకముందే వరప్రసాద్ గారు 2026 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా నిర్మాతలు గర్వం గా పోస్టర్ వేసి ప్రకటించారు. అది చూసే వరప్రసాద్ గారు కొట్టారు రూ.200 కోట్లు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.