చాలారోజుల తర్వాత హిట్ కొట్టిన శర్వానంద్ కళ్లలో ఆనందం కనిపిస్తున్నా ఆయన సినిమాకి కలెక్షన్స్ రాకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతి కి విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమానే. కానీ ఆ సినిమాని చూసేందుకు ప్రేక్షకులకు థియేటర్స్ దొరకట్లేదు.
కారణం ప్రభాస్ రాజసాబ్, మెగాస్టార్ చిరు మన శంకరవరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు, రవితేజ భర్త మహాశయులకు థియేటర్స్ పంచుకోవడమే. అదే మాట నిర్మాత దిల్ రాజు కూడా అంటున్నారు. నేను మాత్రమే కాదు చాలా మంది ఇంకా చూడాలేదు, ఎందుకంటే నారి నారి నడుమ మురారి సినిమా లాస్ట్ కు రిలీజ్ అవ్వడం వల్ల స్క్రీన్స్ తక్కువ గానే ఉన్నాయి.
నైజాం లో ఈ సినిమాని మేము రిలీజ్ చేసినా కూడా 100 % ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం.. అంటూ దిల్ రాజు చెప్పారు. మరి ఈలెక్కన ఈ సినిమా తో శర్వానంద్ హిట్ కొట్టినా నష్టపోయేలా కనిపిస్తున్నాడు. అయితే నారి నారి నడుమ మురారి మౌత్ టాక్ తో థియేటర్స్ కి జనాలు క్యూ కడుతున్నారు. అదే ఎక్కువ థియేటర్స్ ఇస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేది.