పెద్ది చిత్రం తో మార్చ్ 27 న పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ చిత్ర షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తో చరణ్ రొమాన్స్ చేస్తున్నారు. పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ చికిరి ఇంకా ఇంకా రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది.
తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూ లో మీకు ఏ హీరో డ్రైవింగ్ ఇష్టం అంటే.. తనకి తన ఫ్రెండ్ తారక్ డ్రైవింగ్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని.. ఎన్టీఆర్‌ను క్రేజీ, మ్యాడ్ డ్రైవర్ అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ డ్రైవింగ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తారక్ కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చొన్న ఫ్రెండ్స్ కి ఎదురైన అనుభవాలను తనతోనూ చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు.
ఇక పెద్ది చిత్రం మార్చ్ 27 నుంచి వాయిదా పడుతుంది అనే ఊహాగానాలను మేకర్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా పెద్ది మార్చి 27నే ఖాయం చేసుకుంటుంది. త్వరలోనే సెకండ్ సింగిల్ వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.